
మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో అందరిని ప్రేమించు ఎవ్వరిని ద్వేషించకు అనే నినాదంతో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వరంగల్ మిషనరీ ఇంచార్జీ మౌల్వీ అయాన్ అహ్మద్ పాషా అన్నారు.వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎంజిఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పలువురికి పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మౌల్వీ అయాన్ పాషా మీడియాతో మాట్లాడారు.రంమజాన్ మాసంను పురస్కరించుకుని నిరుపేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.హాస్పటల్ లో చికిత్స పొందుతున్నవారందరు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నామన్నారు.అనంతరం హాస్పటల్ సూపరింటెండెంట్ ఆర్ ఎం ఓ లకు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో విశ్వ వ్యాప్తంగా చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించి వరల్డ్ క్రైసిస్ అండ్ ది ఫాత్ వే టు పీస్ అనే గ్రంథాన్ని బహూకరించారు.ఈ కార్యక్రమంలో అహ్మదియ్య స్థానిక పట్టణ అధ్యక్షులు ముహమ్మద్ సలీం,కమిటీ సభ్యులు రియాజ్,రఫీ,కరీం,హమీద్,తదితరులు పాల్గొన్నారు.