
ఆగస్టు 25 నుంచి డివైఎఫ్ఐ రాష్ట్రస్థాయి సమావేశాలు జయప్రదం చేయాలి
దేశవ్యాప్తంగా అందరికీ విద్య ఉపాధి కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ )రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆగస్టు 25 నుంచి 27 వరకు హనుమకొండలో జరుగుతున్నాయని వాటిని జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి పిలుపునిచ్చారు.
బుధవారం ముల్కనూరులో డివైఎఫ్ఐ భీమదేవరపల్లి రెండో మండల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయ స్ఫూర్తితో 1980వ సంవత్సరంలో పంజాబ్లో ఏర్పడ్డ డివైఎఫ్ఐ నాటి నుంచి నేటి వరకు యువకులు, ప్రజలు సమస్యల మీద నిరంతరం పనిచేస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలతో యువతను మోసం చేస్తున్నారు, ఎన్నికలు వస్తేనే యువత గురించి మాట్లాడే పాలకులు ఎన్నికల తర్వాత వారికి ఇచ్చిన హామీని అమలు చేయకుండా విస్మరిస్తున్నారని, సమస్యల సాధన కోసం యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యా, ఉపాధి కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ మహాసభలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి, ఉపాధ్యక్షులు ఎర్రోజు రాజేష్ లు పాల్గొన్నారు
డివైఎఫ్ఐ భీమదేవరపల్లి మండల కమిటీ ఎన్నిక
భీమదేవరపల్లి మండల డివైఎఫ్ఐ కమిటీని 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కమిటీ ఇన్చార్జిగా ఎర్రోజు రాజేష్,
అధ్యక్షులు బి.అర్జున్, కార్యదర్శి కే.వికాస్, ఉపాధ్యక్షులు బి.అక్షిత్, ఎల్. వినయ్, సహాయ కార్యదర్శులుగా పి. కార్తీక్, జి సాయి చరణ్, సోషల్ మీడియా కన్వీనర్ గా బి.నరేష్ ,కొ కన్వీనర్ గా కే.అంజి, కమిటీ సభ్యులుగా డీ .వాచవ్, వై.అజయ్, హర్షిత్ విష్ణు, అన్వేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తిరుపతి తెలిపారు.