ఆటో ప్రమాదం లో హాస్టల్ విద్యార్థి మృతి
దుమ్ముగూడెం మండలం లోని కోతపల్లి గిరిజన బాలుర పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న కుంజా దీపక్ ఆటో ప్రమాదం లో మృతి చెందాడు వివరాల్లోకి వెళితే బండారుగూడెం కి చెందిన కుంజా లక్క్షయ్య పార్వతి దంపతుల మొదటి కుమారుడు కొత్తపల్లి గిరిజన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు తన గ్రామంలో జరిగే కొత్తల పండుగకు హాగరయ్యేందుకు అదే పాఠశాలలో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు కాటిబోయిన జశ్వంత్ ,కాటిబోయిన కార్తిక్ కుంజా అనిల్ తో కలిసి ఆటో లో కొత్తపల్లి హాస్టల్ నుండి ఆటోలో తమ గ్రామమైన బండారుగూడెం బయలుదేరగా తునికిచెరువు సమీపంలో ప్రమాదవశాత్తూ ఆటో బోల్తాపడి కుంజా దీపక్ సంఘటనా స్థలం లోనే మరణించగా మిగతాముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు గాయపడ్డ వారిని భద్రాచలం ప్రభుత్వ హాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఐతే హాస్టల్ విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు గాని హాస్టల్ కేర్ టేకర్ గాని లేకుండా ఏవిధంగా హాస్టల్ నుండి బయటకు వచ్చి ఈ ప్రమాద బారిన పడ్డారు అనేది చర్చనీయ అంశం ఇయ్యింది