ఆత్మగౌరవం ప్రతిఘటన విముక్తి
Uncategorized17 జూలై (కారంచేడు) నుండి 6 ఆగస్టు (చుండూరు) వరకువాడవాడలో దళిత మృతవీరులను స్మరించుకుందాం.,కారంచేడు నరమేధంగత నాలుగు దశాబ్దాలుగా మానకుండా సలుపుతున్న నెత్తుటి గాయం. కారంచేడు మాదిగలపై వందలాది మంది కమ్మకుల ఉన్మాదుల గుంపు దాడి చేసింది. కత్తులు. బరిసేలు, గొడ్డళ్ళతో మాదిగలను విచక్షణా రహితంగా నరికారు. ఆరుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. స్త్రీలు, వృద్ధులు, పసిపిల్లలనే తేడా లేకుండా అనేక మంది తలలు పగులగొట్టారు. కాళ్ళు, చేతులు తెగ్గోసారు. మహిళపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇళ్లన్నీ తగులబెట్టారు. అందిన కాడికి దోచుకున్నారు. ఆర్థికంగా బలిసిన కమ్మ కులస్తులు గ్రామాధిపత్యాన్ని చెలాయిస్తూ BC, SC, ST తదితర పేద వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తుండేవారు. కమ్మలు స్థాపించిన తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చి NT రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమ్మోల్ల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి. దాడులకు గురయ్యే మాల, ఎరుకుల, సాయబు తదితర కులస్తులకు మాదిగ పల్లే అండగా ఉండేది. డాడి చేసిన కమ్మోల్లను మాదిగలు నిలదీసేవారు. కమ్మకులాధిపత్యాన్ని ప్రశ్నించే మాదిగల చైతన్యాన్ని అణచడం కోసం ఈ దాడి జరిగింది. 16 జూలై 1985 రోజున జరిగిన ఒక్క సంఘటను సాకు సాకుగా తీసుకుని ఇంతటి నరమేధానికి పాల్పడ్డారు. మాదిగల తాగు నీటి చెరువులో ఒక కమ్మ యువకుడు గేదెలను దించి, కుడితి తట్టలను కడిగిన నీటిని కలుషితం చేశాడు. “తాగే నీటిని కలుషితం చేస్తున్నవేంటి..” అనీ అక్కడే ఉన్న చంద్రయ్య అనే దళిత యువకుడు ప్రశ్నించాడు. మాదిగ యువకుడి ప్రశ్నను సహించలేని కమ్మకులస్తుడు అత అతన్ని చెన్న కొలతో కొట్టి కులం పేరుతో దుషించాడు. అప్పుడే మంచి నీళ్ళ కోసం వచ్చిన మున్నంగి సువార్ధమ్మ అతన్ని వారించింది. నీటిని కలుషితం చేసింది కాకుండా వికలాంగుడు మీద దాడి చేస్తున్నావ్.. నువు మనిషివేనా” అని తిట్టింది. దాంతో వాడు సువార్డమ్మను కూడా చెర్నాకోలతో కొట్టాడు. సువార్తమ్మ నీళ్ళ బిండెను ఎత్తి వాణ్ణి కొట్టింది. అంతే ఒక మాదిగ గ స్త్రీ కమ్మొలను కొట్టిందనే వార్తను సహించలేక మాదిగలందరికి గుణపాఠం చెప్పాలనే కక్షతో ఇంతటి నరమేధానికి పూనుకున్నారు.కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణ సభ లో వారికి నివాళులు. జయరాజు రాష్ట్ర అధ్యక్షులు, కెఎస్పిఎస్ అధ్యక్షత:వక్తలు: ప్రొ. సూరేపల్లి సుజాత శాతవాహన యూనివర్సిటీ బత్తుల కార్తీక్ నవయాన్ – హైకోర్టు న్యాయవాది రెంజర్ల రాజేష్ దక్షిణ భారత రాష్ట్రాల అధ్యక్షుడు సమతా సైనిక్ దళ్ (SSD) జాన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా కళామండలి (PKM) బూరం అభినవ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, కెఎస్పిఎస్కులనిర్మూలనా కళాకారులచే పాటలు ఉంటాయి23 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో విజయం సాధించిన బాధితులు, ఏమాత్రం రాజీలేని పోరాటాన్ని నడిపి దేశమ్ మొత్తం కారంచేడు వైపు తిరుచూసేలా చేసిన బాధితుల పోరాటం వలన 30 అక్టోబర్ 1994 న జిల్లా కోర్టులో దోషులకు శిక్ష పడింది. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కింద 24 జూలై 1998వ హైకోర్టు కేసును కొట్టేసింది. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజీపడని బాధితులు సుప్రీం కోర్టుకి వెళ్ళారు. పదేళ్ల తర్వాత 19 డిసెంబర్ 2008న సుప్రీంకోర్టు దోషులకు శిక్షలు వేసింది. ప్రధాన ముద్దాయి అంజయ్యకు జీవిత ఖైదు విధించింది. 29 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.కారంచేడు బాధితులు నడిపిన పోరాటం ఇప్పటికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఎన్నో సవాళ్లను, ప్రశ్నలకు సమాధానాలను అందిస్తూ కారంచేడు ఉద్యమం సాగింది. అనేక హక్కులు SC,ST అత్యాచార నిరోధక చట్టం లాంటి వాటిని సాధించి దళిత ఉద్యమ ప్రస్థానానికి నాంది పలికింది అని చెప్పవచ్చు. దళిత ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరులో అసువులు బాసిన కారంచేడు దళిత మేృత వీరులకు జోహార్లు.పిడికెడు ఆత్మగౌరవం కోసం అగ్రకులోన్మద శక్తులతో తలబడుతూ దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరులో ఓరిగిపోయిన దళిత మృత వీరులను తలుచుకుంటూ 17 జూలై (కారంచేడు) నుండి 6 ఆగస్టు (చుండూరు) వరకు వాడవాడలో దళిత | మృత వీరుల సంస్మరణ సభలు జరపాలని కుల నిర్మూలనా పోరాట సమితి (KNPS) పిలుపునిస్తున్నది. అందులో భాగంగా 17 జూలై 2024 రోజున హైదరాబాద్లో జరుపుతున్న కారంచేడు దళిత మృత వీరుల సంస్మరణ సభ లో ప్రజలు, దళిత,బహుజన, ప్రజాసంఘాలు కులనిర్మూలనా పోరాట సమితి (KNPS), తెలంగాణజయరాజు, రాష్ట్ర అధ్యక్షులు, అభినవ్ బూరం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి