ఆదర్శవంత గ్రామంగా అభివృద్ధి చేస్తా
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నాంపల్లి విజయ అశోక్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గతంలో సర్పంచ్ చేసిన అనుభవం ఉంది గతంలో ఎన్నో మంచి పనులు చేశాము గ్రామానికి మరో మారు అవకాశం ఇస్తే గ్రామంలో ఉన్న సమస్యలకు పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తానని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని గ్రామంలో డ్రైనేజీలు గాని సిసి రోడ్లు గాని పింఛన్లు రానివారికి పించిని వచ్చేటట్లు చేస్తానని ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని నేను హామీ ఇస్తున్నాను. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.