
ఎసిరెడ్డి నగర్ డబల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన ములుగురి కుమార్ చిన్న కుమారుడు శశి కుమార్ (చిట్టిబాబు) గత ఆదివారం రోజున రఘునాథపల్లి లో రోడ్డు ప్రమాదం జరిగి హైదరాబాదులోని నాగోల్ లో గల సుప్రజా ఆసుపత్రిలో అత్యంత ప్రమాదకర స్థితిలో చేరి ఆపరేషన్స్ జరిగి చికిత్స పొందుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే…* ఈచికిత్సకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుంది.వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే ఈవిషయం నేను సోషల్ మీడియాలో పెట్టి సాహృదయ దాతలు ఆర్థిక సాయం చెయ్యగలరు అని పోస్టింగ్ పెట్టగా హైదరాబాదులో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మాఅక్క కొడుకు పచ్చిమట్ల సాయికుమార్ సోషల్ మీడియాలో నేను పెట్టిన పోస్టింగు చూసి స్పందించి తన మిత్రులకు తెలిపి తన మిత్రులు తను కలిసి పదివేల రూపాయలు కలెక్ట్ చేసి నిన్న రాత్రి 9:30 గంటలకు శశికుమార్ చికిత్స పొందుతున్న సుప్రజ హాస్పిటల్కు చేరుకొని శశికుమార్ ను చూసి వారి తండ్రి కుమారుని ఓదార్చి వారు కలెక్ట్ చేసిన 10000 పదివేల రూపాయల నగదును కుమారుకు హాస్పటల్ వద్ద అందించారు.* *అంతేకాకుండా ఇంకా మిత్రుల ద్వారా తన ప్రయత్నం చేస్తారని భరోసా ఇచ్చారు.నేను పెట్టిన సోషల్ మీడియా పోస్టింగుకు స్పందించి ఆర్థిక సహాయం తను తన మిత్రుల ద్వారా అందించిన మా మేనల్లుడు సాయికుమార్ అఖిల్ కుమారును దీవిస్తూ అభినందిస్తున్నాను. బూడిద గోపి సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు.