
ప్రభుత్వ భూములపై ఆదివాసులకే సర్వహక్కులు!
ప్రభుత్వ భూములపై ఆదివాసులకే సర్వహక్కులు!
గోండ్వానా సంక్షేమ పరిషత్…
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్త గూడెం పంచాయతీ పరిధిలోగల కొమరం భీం కాలనీకి చెందిన ఆదివాసులు 10 కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా కొమరం భీమ్ కాలనీలో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో ములుగు సబ్ కలెక్టర్ గా పనిచేసిన వీపీ గౌతమ్ ఐఏఎస్ కొమరం భీం కాలనీలో పర్యటించి అక్కడ ప్రభుత్వ భూములకు సరిహద్దులలో దిమ్మల ఏర్పాటు చేశారు. ఆ భూములను 10 ఆదివాసీ కుటుంబాలు వ్యవసాయం సాగు చేసుకుంటుంటే రాజకీయ పార్టీ అండదండలతో ఆదివాసులపై ముకుమ్మడిగా దాడులకు పాల్పడుతున్నారని GSP ఆరోపించింది. అంతే కాదు ఈ దాడి విషయంలో గతంలో వెంకటాపురం పిఎస్ లో ఫిర్యాదు చేసినప్పటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న గిరిజనేతరులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆ భూములు ఆదివాసులకు పంచేవరకు GSP రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని GSP రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారయణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పూనేం ప్రతాప్, కారం రాజబాబు, తాటి రాజేష్ , తాటి మనోజ్, తాటి లక్ష్మయ్య, తాటి కవిత, కొరసా సీత, తాటి సంధ్య, ఆగనిపల్లి లక్ష్మి, కోరం లోకేష్, తాటి రమేష్, కొరస దినేష్ ,శాప రామ్మూర్తి, కనితి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.