ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన అడ్డగూడూరు మండల ప్రజలు గళం న్యూస్ అడ్డగూడూరు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ వరకు బస్సు వేయించి గురువారం నాడు అడ్డగూడూరు మండల పరిధిలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి బస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బస్సును సద్వినియోగం చేసుకోవాలని, రానున్న రోజుల్లో అడ్డగూడూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు, అనంతరం అడ్డగూడూరు నుండి లక్ష్మీదేవి కాల్వ వరకు టికెట్ కొనుగోలు చేసి అదే బస్సులో ప్రయాణించి గ్రామ ప్రజల్లో ఆనందం నింపారు, ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు పూలపల్లి సోమిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వల్లంబట్ల రవీందర్, గూడెపు పాండు, కడారి రమేష్,మారిశెట్టి మల్లేష్,బాలెంల మహేందర్, డప్పు యాదగిరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు