మునగాల మండల కేంద్రానికి చెందిన కోదాటి వెంకయ్య అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి ఆర్దిక భరోసాగా మునగాల శాలివాహన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు సిరికొండ అంతయ్య మాట్లాడుతూ శాలివాహన కులానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలు కష్ట సమయంలో సొసైటీ ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, ఇప్పటివరకు పది కుటుంబాల వారికి రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేసినట్టుగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.