ఆర్ కానిస్టేబుల్ చంద్రనాయక్ పార్ధివ దేహానికి నివాళులు
అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ సీయం ఎస్కార్ట్ విధుల నిమిత్తం విజయవాడ వెళ్లిన చంద్రా నాయక్ నిన్నటి రోజున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ నేపథ్యంలో అనంతపురంలోని వారి నివాసం నందు వారి పార్ధివ దేహానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ చంద్రా నాయక్ చాలా సౌమ్యులని, విధి పట్ల అంకిత భావం కలిగినవారని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రఘాడ సానభూతి తెలియజేశారు. గోరంట్ల జడ్పీటీసీ జయరాం నాయక్ వైయస్సార్సీపీ నాయకులు వెన్నపూస రవీంద్రా రెడ్డి , వైయస్సార్సీపీ నాయకులు చంద్రా నాయక్ కి నివాళులు అర్పించారు.