
telugu galam news e69news local news daily news today news
సంబంధిత స్పెషలాఫీసర్లు వారికి కేటాయించిన పాఠశాలలో తప్పనిసరిగా సందర్శించాలి —- ఐ టి డి ఎ, పీ ఓ ప్రతీక్ జైన్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యే నాటికి, సంబంధిత స్పెషలాఫీసర్లు వారికి కేటాయించిన పాఠశాలలకు తప్పనిసరిగా సందర్శించి, విద్యార్థుల యొక్క చదువు ఏ విధంగా సాగుతున్నది గమనిస్తూ ఉండాలని, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. ఐ టి డి ఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ ఆఫీసర్ల సమక్షంలో వివిధ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎక్కువ శాతం అర్జీలు పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ట్రైకర్ రుణాలు, పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు ఇప్పించుట కొరకు, మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుట కొరకు ,మరియు కిరాణా షాపులు, ఏఎన్ఎం పోస్టుల కొరకు, గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన కే. సంతోష్ కుమార్ మరియు 21 మంది నిరుద్యోగులు, సొసైటీ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పెంపొందించు కావడానికి ఉపాధి కల్పించుట కొరకు, పినపాక మండలం జగ్గారం గ్రామానికి చెందిన పి. సుజాత ఏఎన్ఎం ఉద్యోగం కొరకు, కారేపల్లి మండలం ఎర్రబోడు గ్రామానికి చెందిన కే. సత్యనారాయణ మరియు 14 మంది గిరిజనులు పట్టా భూములలో ట్రైకార్ ద్వారా బోర్లు వేయించుట కొరకు, అశ్వరావు పేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన వెంకటరమణ పీసా గ్రామసభలలో విధులు నిర్వహించినందుకు వేతనం ఇప్పించుట కొరకు, ఖమ్మం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీ తమ గ్రామానికి కరెంటు లైన్ ఇప్పించుట కొరకు, దుమ్ముగూడెం మండలం సింగవరం గ్రామానికి చెందిన వికలాంగుడు, వి. రాజేష్ కిరాణా షాప్ ఇప్పించుట కొరకు, ఎంకూరు మండలం ఊటిపల్లి గ్రామానికి చెందిన భూక్య లక్ష్మి, 12 మంది గిరిజనులు గిరి వికాసం కింద బోరు, మోటారు, కరెంటు ఇప్పించుట కొరకు, మరియు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉపాధి పొందుటకు వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ లో గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజనులకు విడతల వారీగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఆర్సిఓ గురుకులం వెంకటేశ్వరరాజు, ఎస్ఓ సురేష్ బాబు, ఏ పీ ఓ పవర్ మునీర్ పాషా, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, డిఎస్ఓ ప్రభాకర్ రావు, ఏడి అగ్రికల్చర్ భాస్కరన్, ఎల్ టి ఆర్ విభాగం నరేష్, ఎస్ డి సి విభాగం వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ సిడిపిఓ సావిత్రి, టీచర్ పద్మావతి, జిసిసి సుగుణ ,జేడీఎం హరికృష్ణ ,హెల్త్ విభాగం ప్రసాద్, మరియు నాగభూషణం, మణి కుమారి, తదితరులు పాల్గొన్నారు.