ఆశ్రమ సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ అందరినీ క్రమబద్ధీకరించాలి.
Nalgonda* పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి డిమాండ్. తెలంగాణ రాష్ట్రమంతటా ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖలోని ప్రభుత్వ బాలబాలికల వసతి గృహములు మరియు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న 3000 మంది రైల్వే వర్కర్స్ ను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. నల్లగొండ జిల్లాలో 42 ఆశ్రమ గురుకుల గృహాల్లో 9570 మంది విద్యార్థులు విద్యార్థులు వసతి పొందుతున్నారని ఇట్టి వసతి గృహముల ఎంతో ప్రభుత్వ గతంలో వందమంది గాను ఐదుగురు వర్కర్స్ ను ఉండాలి అనే జీవో కూడా తీయడం జరిగిందని కానీ నల్లగొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ యందు 45 మంది మాత్రమే రెగ్యులర్ వర్కర్లుగా ఉన్నారు. 282 మంది డైలీ వర్కర్లతో జిల్లా వాస్తు గృహాలు నడుస్తున్నాయని వీరు దాదాపు 20 30 సంవత్సరాల నుండి డైలీ వర్కర్లుగా పనిచేస్తున్న వీరిని ప్రభుత్వ ఉద్యోగుల క్రమబద్ధీకరించకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే వీరికి నూతన పిఆర్సి ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు కరోనా సమయంలో ప్రభుత్వ హరిజన గిరి సంక్షేమ శాఖ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వర్కర్లకు కరోనా సమయంలో పూర్తిగా జీతభత్యాలు ఇచ్చారని గిరిజన సంక్షేమ శాఖలు ఇవ్వకపోవడం ఏందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు అవుట్సోర్సింగ్ విధానాన్ని కూడా వర్కర్లకు వర్తింప చేయకుడదన్నారు. ఆరోగ్య భీమా కల్పించాలని అన్నారు సమాన పనికి సమాన వేతనం సకాలంలో ఇవ్వాలన్నారు లేనియెడల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ఆందోళన పోరాటాలు మద్దతుగా చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షులు యాదగిరి నరసింహ ఉపాధ్యక్షులు జయ నాయకులు జయసింగ్ ధర్మేందర్ నాగరాజు మీనా భారతమ్మ లక్ష్మి జ్యోతి సునీత తదితరులు పాల్గొన్నారు.