ఆహారం,మంచి నీళ్లు ఇతర నిత్యఅవసర వస్తువులు సరఫరా
Hanamkondaగౌరవ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు గౌరవ శ్రీ.దాస్యం వినయ్ భాస్కర్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్)లో పాల్గొన్నారు
దాస్యం వినయ్ భాస్కర్ కామెంట్స్
ఆకాల వర్షాల కారణంగా గత వారం రోజులుగా హన్మకొండ నగరం లోని కొన్ని ప్రాంతాలు వరద ముంపుకి గురి అయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని తెలిపారు.భారీ వర్షాలు వరదలు వచ్చిన కూడా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఏటువంటి నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అని తెలిపారు.
వరదల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి వారికి ఆహారం,మంచి నీళ్లు ఇతర నిత్యఅవసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది అని తెలిపారు.
ఏటువంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కలెక్టర్,పోలీస్ కమిషనర్,మున్సిపల్ కమిషనర్,రెవిన్యూ,పోలీస్,ఫైర్ డిపార్ట్మెంట్,మున్సిపల్ సిబ్బంది తదితరులు ఆహార్నిషలు కృషి చేశారు అని తెలిపారు. గత సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా ముంపు గురి అయిన సమ్మయ నగర్, వాజ్పాయ్ కాలనీ,కూడా కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం వలన ఈ సారి చాలా వరకు వరద ముంపు తప్పింది అని తెలిపారు.
గత సంవత్సరం వర్ష కాలంలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవ కేటీఆర్ గారు తక్షణ సహాయం కింద 25 కోట్ల రూపాయలు మరియు ముంపు ప్రాంతాలలో డ్రైన్ నిర్మాణం కొరకు 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అని తెలిపారు.
ఆ పనులు చివరి దశలో ఉన్నాయి అని త్వరలో పనులు పూర్తి అవుతాయి అని తెలిపారు.
భారీ వర్షాలు వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనో ధైర్యం ఇచ్చి అండగా నిలవాల్సిన బాధ్యత గల నాయకుడిగా ఉండాల్సింది పోయి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
ఆపత్కాలంలో వీలు అయితే ప్రజలకు అండగా ఉండండి కాని రాజకీయం చేయకండి అని అన్నారు.
వర్షాలతో నష్ట పోయిన వారిని ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం అని అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద బాధితులకు అండగా ఉంటారని ఆశించాము.
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలోనే వచ్చారు.
కిషన్ రెడ్డి వరదలు వచ్చినప్పుడు వస్తే బాగుండేది. మేం కష్టపడి వారికి అండగా నిలిచాము.
కేంద్ర మంత్రి వరదలు తగ్గిన నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు వచ్చారు.
కిషన్ రెడ్డి… బీజీపీ అధ్యక్షుడిగా వచ్చి వరదలపై రాజకీయం చేస్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ రోడ్స్ నిధులు సకాలంలో విడుదల చేస్తే పనులు పూర్తయ్యేవి. వరదల ప్రభావం ఇంతగా ఉండేది కాదు.
వరద బాధితుల కోసం ఏం చేస్తారో కిషన్ రెడ్డి స్పష్టత ఇస్తే బాగుండేది.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధుల కింద 196 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వ వాట కింద 213 కోట్లు కేటాయించడం జరిగింది అని తెలిపారు.కేంద్రం తన వాట లో పెండింగ్ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తుంది అని తెలిపారు.కేంద్రం తన వాట నిధులు విడుదల చేస్తే రాష్ట్ర తన వాట నిధులు విడుదలకి సిద్ధం గా ఉంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ్యులు అరురీ రమేష్ గారు, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నగూర్ల వెంకటేశ్వర్లు గారు,కూడా చైర్మన్ సుందర్ రాజ్ గారు, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి గారు, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు