
-జనగామ జిల్లా ఐద్వా సంఘ అధ్యక్షురాలు షబానా బేగం
E69 news జఫర్ఘడ్ ఫిబ్రవరి 06
జనగామ జిల్లా జఫర్ఘడ్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు, ఐద్వా,వ్యకాస సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి ఇంటి నిర్మాణం కోరకు 5 లక్షల రూపాయలు అసెంబ్లీ బడ్జెట్ లో కేటాయించాలని,మరియు ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం చూపించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి షభాన మాట్లాడుతూ జఫర్ఘడ్ మండల పరిధిలో గల నిరుపేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని,ప్రస్తుతం పేద బడుగు,బలహీన వర్గాల ప్రజలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయాలు పెరగడం లేదని, వీటికి తోడు అప్పులతో సతమతమవుతున్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఇండ్ల నిర్మాణం కొరకు 5లక్షల రూపాయల బడ్జెట్ ను కేటాయించి వెంటనే మంజూరి చేసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గుండెబోయిన రోజా రాపర్తి లక్ష్మి రాపర్తి శోభ నక్క యాకన్న గుండెబోయిన రాజు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వడ్లకొండ సుధాకర్ యాతం సమ్మయ్య సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల రాములు వేల్పుల చిన్న రాములు ఆకుల సారంగం కుక్కల కృష్ణమూర్తి రాజు ఆకుల బలరాములు ఎర్ర రవి తదితరులు పాల్గొన్నారు.