ఇండ్ల స్థలాల భూమిని అర్హులైన పేదలకు వెంటనే పంపిణి చేయాలి
Nalgondaపాలడుగు నాగార్జున సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్.
ప్రభుత్వం 2009 సంవత్సరంలో ఇండ్ల స్థలాలకొరకు 3 ఎకరాల భూమిని సేకరించ్చిందని వెంటనే అర్హులైన పేదలకు పంపిణి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఈరోజు మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామం లో పేదలతో కల్సి పరిశీలించడం జరిగింది. అనంతరం మర్రిగూడ తహసీల్దార్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం సేకరించిన ఇండ్ల స్థలాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అనారులు ఆక్రమించుకొని అమ్ముకునే పరిస్థితి ఉందని తెలిపారు. ఎర్రగండ్లపల్లి గ్రామంలో సర్వే నెంబరు 724 లో 9 ఎకరాల భూమి సేకరించి అది నిరూపియోగంగా ఉందని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఇందుర్తి గ్రామంలో సేకరించిన భూమిలో కొందరు అక్రమార్కులు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారనే పరిస్థితి తెలిసింది స్థానిక మండల తహసిల్దార్ బక్క శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇచ్చి వెంటనే సర్వే నిర్వహించి భూములను కాపాడి ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో తామే పేదలతో కలిసి గుడిసెలు వేపిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈనెల 24 25 26 తేదీలలో తాసిల్దార్ కార్యాలయం జరిగే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని కోరారు అనంతరం 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం జరిగే ధర్నాను మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పల యాదయ్య మండల కమిటీ సభ్యులు నీలకంఠం రాములు రామలింగాచారి దామెర లక్ష్మి ఏరుకొండ రాఘవేంద్ర మందడి యాదగిరి రెడ్డి గిరి సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.