
ఈ69న్యూస్ హన్మకొండ
హనుమకొండ: జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎంపీడీవోలతో మాట్లాడిన ఆమె, సొంత భూమి ఉన్న అత్యంత నిరుపేదలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.