
ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం.
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో ఆకుపాముల గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండల ప్రధాన కార్యదర్శి బాణాల మల్లాచారి శారద దంపతుల మనుమడు విగేంద్ర చారి ద్వితీయ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు కటుకోజు నాగేంద్ర చారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశోజు ఉపేంద్ర చారి. సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలా పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులు మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషమని అలాగే ప్రతి ఒక్కరు ఇలా తమ ఇళ్లల్లో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా వారికి అందుబాటులో ఉన్న ఆశ్రమాలకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వారికి అండగా నిలవాలని అలాగే ఇలా ఆశ్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రభుత్వాలు దాతలు తోడ్పాటు అందించాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో బాబు తల్లిదండ్రులు కొడిమళ్ల. పవన్ కళ్యాణ్ చారి మణికుమారి దంపతులు కొడిమళ్ల రామాచారి వీర పాపమ్మ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు పర్వతం రామాచారి .తడక మల్ల శ్రీనివాసాచారి . నాగారపు బ్రహ్మచారి . ఇనుగుర్తి వీరాచారి. గజ్జల రవికుమార్ జూకంటి ఉపేంద్ర చారి. జిల్లేపల్లి శ్రీధర్ చారి. ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు