గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన అల్లే స్వప్న ఇల్లు రెండు రోజుల క్రితం విద్యుత్ షాక్ తో ఇల్లు మొత్తం కాలిపోయి ఇంటిలోని సామాను కూడా కాలిపోవడంతో తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి నెలకొనడంతో వారి పరిస్థితి గురించి సోషల్ మీడియాలో రావడంతో జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి ఆదేశాల మేరకు రేగొండ మండల్ ఇంచార్జ్ ఆకుల ప్రతాప్ తిరుమలగిరి గ్రామంలోని అల్లే స్వప్న ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు, బట్టలు, 25 కేజీల రైస్ బ్యాగ్ మరియు 3000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో వెన్నెపు రెడ్డి అర్జున్,చింత కింది రాజు,అప్రోజ్ తదితర సభ్యులు పాల్గొన్నారు.