లండన్ చేరుకున్న భారతదేశ అహ్మదీయ ప్రతినిధులు ఈ69న్యూస్ లండన్ మోడ్రన్ /యూకే /జూలై 17:-ఈ నెల 25, 26,27 తేదీలలో లండన్ హదీఖత్తుల్ మహ్దీ ప్రాంగణంలో జరగబోయే యూకే అహ్మదీయ ముస్లిం అసోసియేషన్ వార్షిక మహాసభలో పాల్గొనబోయే భారతదేశానికి చెందిన 16 మంది ప్రతినిధులు నిన్న సాయంత్రం లండన్ హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ ప్రతినిధి బృందం భారత అహ్మదీయ ముస్లిం జమాఅత్ అధ్యక్షులు మౌలానా మొహమ్మద్ ఇనామ్ గోరి నేతృత్వంలో బయలుదేరింది.లండన్‌కు చేరుకున్న ప్రతినిధులకు యూకే అహ్మదీయ ముస్లిం అసోసియేషన్ హృదయపూర్వకంగా స్వాగతం పలికింది.ఈ సందర్భంగా ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాల నుండి ప్రతినిధిగా హాజరైన జైనుల్ ఆబిదీన్ మాట్లాడుతూ..ఈ మహాసభలో 100కు పైగా దేశాల నుండి సుమారు 40,000 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారు.ఇది నిజమైన ఆత్మీయ సమాగమం.ప్రపంచ అహ్మదీయ ముస్లింలకు మార్గదర్శకుడైన ఖలీఫా హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్(అయ్యదహుల్లాహు తఆలా బినస్రిహిల్ అజీజ్)ప్రసంగాలు ఎంటిఎ ఇంటర్నేషనల్ ఛానల్ ద్వారా ప్రసారమవుతాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అహ్మదీయ ముస్లింలందరికీ ఇది ఒక గొప్ప మహాసభగా నిలుస్తుంది అని చెప్పారు.