ఈపీసెట్-2026 పరీక్షకు విశేష స్పందన
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల వారి ఆధ్వర్యంలో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గం స్థాయిలోని అన్నిప్రభుత్వ మరియు ప్రవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల యం.పి.సి(ఎంపీసీ)విద్యార్థినీ, విద్యార్థులకు సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో నమూనా ఈపీసెట్-2026 పరీక్ష నిర్వహించటం జరిగింది. సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, కళాశాల ఫ్యాకల్టీ మెంబర్స్ మరియు సిబ్బంది వ్యయప్రయాసలతో నేటి విద్యార్థినీ, విద్యార్థులను టెక్నికల్ విద్యపై అవగాహన కల్పించాలనే పట్టుదలతో ఈ నమూనా ఈపీసెట్-2026 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఆబ్జెక్టివ్(బహూళైఛ్చిక) విధానంలో నిర్వహించారు. పరీక్ష విధానం గణితం-80 బిట్స్, 80 మార్కులు, రసాయన శ్రాస్త్రం 40 బిట్స్, 40 మార్కులు, భౌతిక శాస్త్రం 40 బిట్స్,40 మార్కులు, మొత్తం:160 బిట్స్ 160 మార్కులు, 180 నిమిషాలుగా ప్రవేశ పరీక్ష నిర్వహించబడినదని కళాశాల నమూనా ఈపీ సెట్-2026 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కన్వీనర్ మరియు కళాశాల ఈఈఈ విభాగాధిపతి కోట.రామకృష్ణప్రసాద్ వ్యవహరిస్తూ వివరాలు తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్:వూటుకూరి.శేషారత్నకుమారి మాట్లాడుతూ ఇటువంటి పరీక్షల ద్వారా విద్యార్థినీ, విద్యార్థులు తమ నైపుణ్యాలను పరీక్షించుకోవడంతోపాటు తమకు పరీక్షల యందు ఉన్న బిడియం, భయం మొదలగునవి ఉండవని చెప్పారు.విద్యలో పరీక్షలు విజయానికి ఒక సోపానం దానికి మీ శాయశక్తులా కృషి చేయడం వల్ల మీకృషి మీకు అద్భుతమైన ఫలితాలు తెస్తుంది. విద్యపై దృష్టి కేంద్రీకరించి సానుకూలంగా మరియు ప్రశాంతంగా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరారు.విద్యార్థినీ,విద్యార్థులు పట్టుదలతో చదువుకొని అత్యధిక మార్కులు సాధించి ఉత్తమ ర్యాంకులు తెచ్చుకోవాలని కోరారు.ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్:వూటుకూరి.శేషారత్నకుమారి సెల్ నెంబర్:9963084558,కళాశాల అడ్మిషన్స్ ఇన్ చార్జీ కోట.రామకృష్ణప్రసాద్ సెల్ నెంబర్:9642621363ని సంప్రదించాలని తెలిపారు.ఈ సందర్భముగా జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షకు హాజరు అయిన విద్యార్థినీ, విద్యార్థులకు ఇంటర్మీడియట్ అనంతరం పై కోర్స్ లకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ఇంటర్మీడియట్ పూర్తివడంతోనే ఏ విభాగంలో చదువు కొనసాగించాలా అన్న ఆలోచన విద్యార్థుల్లో మొదలుతుంది. ఇంటర్మీడియట్ తోనే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే సదవకాశం ఇంటర్మీడియట్ కోర్సుల ద్వారా లభిస్తుంది. చిన్నవయస్సులో ఉద్యోగంలో స్థిరపడాలనుకునేవారు, ఇంజనీరింగ్ గా ఎదగాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సులు మంచి వేదికగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఎందరో సాఫ్ట్వేర్ రంగంలో ఏ.ఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ తో మంచి మంచి ప్యాకేజీలతో జీవితంలో స్థిరపడుతూ మెరుగైన జీవితం అనుభవిస్తున్నారని చెప్పారు. చదువుకు తగ్గ కొలువులు అందిపుచ్చుకొని చాలామంది విదేశాల వైపు ప్రయాణాన్ని సాగిస్తున్నారని అన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులు మార్కెట్ కు తగిన జాబ్ స్కిల్స్ పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందుంటున్నారని చెప్పారు.అంతేకాదు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈ.పి. సెట్2026)లో ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ విధానంలో ప్రవేశం నేరుగా ఇంజనీరింగ్(బి.టెక్)ప్రధమ సంవత్సరంలో ప్రవేశించవచ్చునని చెప్పారు. ఈ సందర్భముగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాధికులు, హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత,రాజ్యసభ సభ్యులు మరియు సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి.పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి.అన్విద వర్చువల్ రియాలిటీ సిస్టమ్(విఆర్ఎస్)ద్వారా విద్యార్థినీ,విద్యార్థులకు అభినందనలు/శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో: కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్:వూటుకూరి.శేషారత్నకుమారి,కళాశాల అన్నీఇంజనీరింగ్ బ్రాంచీల విభాగాధిపతులు,కళాశాల ఫ్యాకల్టీ మెంబర్స్,సిబ్బంది మరియు ఇంటర్మీడియట్ విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.