
badrahachalam news
2023 -24 విద్యా సంవత్సరంనకు గాను ఖమ్మం రీజియన్ లో గల 8 ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలలకు యూనిఫామ్ కుట్టుటకు అర్హులైన ఎస్టీ గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతిక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన గిరిజన అభ్యర్థులు ఈనెల 8వ తేదీ ఉదయం 10:30 గంటల నుండి 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు రూపాయలు వెయ్యి రూపాయలు దరఖాస్తు ఫారం తో ప్రాంతీయ సమన్వయ అధికారి గిరిజన గురుకు లాల సంస్థ ఐటీడీఏ భద్రాచలం కార్యాలయము నందు సమర్పించాలని, ఇంకా ఏమైనా వివరాల కొరకు 99497 23291, 9182 552138 నంబర్లకు ఫోన్ ద్వారా తెలుసుకోవాలని ఆయన కోరారు.