
ఈ నెల 9న జరిగే కార్యకర్తల సదస్సును విజయవంతం చేయండి
ఈ నెల 9న కోదాడ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు జరిగే నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకట్ రెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలో పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం దగ్గర నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు..కేంద్రంలో నరేంద్ర మోడీ,రాష్ట్రంలో కేసీఆర్ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూన్నారని
దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపదను పాలకులు దోచుకుంటున్నారని గత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి విద్య, వైద్యం,ప్రాజెక్టులు,పరిశ్రమలు తాగునీరు, సాగునీరు అందించి దేశాన్ని అగ్రభాగంలో నిలిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాయమాటలతో మళ్ళీ దళిత బంధు, గిరిజన బంధు,మైనార్టీ బందు అంటూ ఓట్ల కోసం వస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వేపూరి సుధీర్, మైనారిటీ నాయకులు హైమద్, పల్లపు గోపాల్ తదితరులు ఉన్నారు.