
telugu galam news e69news local news daily news today news
ఈ69న్యూస్ (తెలుగు గళం )కు ప్రత్యేక స్థానం ఉందని, మిగతా పత్రికల తో పాటు ఈ69న్యూస్ (తెలుగు గళం ) కూడా దుసుకుపోవలని ఆలయ ఈఓ రమాదేవి, స్థానిక యం ఎల్ ఏ తెల్లం వెంకటరావు అన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం లో, యం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం ఈ69న్యూస్ (తెలుగు గళం ) 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ69 పత్రిక ఎప్పటికప్పుడు వార్తలను ఆన్ లైన్ ద్వారా పాఠకుల ముందుంచుతూ విశేష ప్రజాధరణ పొందాలని భవిష్యత్ లో వినూత్న రీతిలో వార్తా కథనాలు రాసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం రిపోర్టర్ మడకం సతీష్, ఆలయ ప్రధాన అర్చకులు, రాయపూడి ఏసు రత్నం, శివ, భూపెందర్ తదితరుల పాల్గోన్నారు.