ఉచిత కుట్టు శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి
Anantapur, Andhra Pradesh-ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
ఈ69 న్యూస్, శింగనమల.
శింగనమల మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సహకారంతో వెనుకడబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ వారి సహకారంతో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉచిత కుట్టు శిక్షణా (టైలరింగ్) కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచిత కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని,ఇప్పటి రోజుల్లో కుటుంబ పోషణలో మహిళల పాత్ర చాలా కీలకమని చెప్పారు.శింగనమల నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం తరపున 500 కుట్టుమిషన్లు మంజూరు అయ్యాయని రాబోయే రోజుల్లో మరిన్ని కుట్టుమిషన్లు మంజూరు చేస్తామని తెలిపారు.ప్రతి మహిళా ప్రభుత్వం కల్పించిన 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకుని,ఉపాధి పొందాలని సూచించారు. శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మెషీన్ లును ప్రభుత్వం తరపున ఇస్తామని పేర్కొన్నారు.చంద్రబాబు నాయుడు మహిళలు ను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు.ఏప్రిల్ 8 – 22 వరకు ఆంధ్రప్రదేశ్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల నందు నిర్వహించిన పోషణ పక్షోత్సవాలు లో భాగంగా శింగనమల మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు.