
jangoan news
జఫర్ఘడ్ మండలంలోని కొనాయి చెలం గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్డక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం మరియు గలికుంటు నివారణ టీకాలు కార్యక్రమము నిర్వహించనైనది ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహణాధికారి డాక్టర్ వి.రఘుబాబు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యవర్గ సభ్యుడు చింతకుంట్ల ఉపేందర్ రెడ్డి పాల్గొని పాడి రైతులకు పశుగ్రాసాల పెంపకం,దూడల పెంపకం గురించి వివరించారు. ఈ శిబిరంలో ఉప్పుగల్ పశువైద్యాధికారి డా ..కే.శ్రీనాథ్ 69పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేసి ఉచితముగా మందులు పంపిణీ చేయనైనధి.పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ వై.రాజేశ్వరరావు గోపాలమిత్రలు కే.లచ్చయ్య , సి.హెచ్.నగేశ్,జి. రాజు , యం.రవీందర్,
పశుమిత్ర స్వప్న గ్రామస్తులు పాడి రైతులు పాల్గొన్నారు.