
ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఎంతో దోహదపడతాయి
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువకులు ఆటలపై మక్కువ చూపిస్తే భవిష్యత్తును బంగారు బాటలు వేసుకోవచ్చని కిసాన్ పరివార్ మహబూబాద్ జిల్లా కోఆర్డినేటర్ గణరపు హరిబాబు అన్నారు.మహబూబాద్ జిల్లా మల్యాల దామ్యా నిర్వహించిన దామ్యా తండా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కు కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు,ప్రముఖ పారిశ్రామికవేత్త యువ నాయకులు నానావత్ భూపాల్ నాయక్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువకులు కూడా క్రీడలో రాణించాలనే ఉద్దేశంతో మొదటి బహుమతిగా 20వేల రూపాయలను,రెండో బహుమతిగా పదివేల రూపాయలను క్రీడాకారులకు అందజేశారు.కిసాన్ పరివార్ జిల్లా కోఆర్డినేటర్ హరిబాబు మాట్లాడుతూ మహబూబాద్ గిరిజన జిల్లా కావున గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన యువకులు అధికంగా ఉంటారు కావున మంచి పకృతి వాతావరణంలో పెరుగుతూ దృఢంగా ఉంటారుదృఢంగా ఉంటారు.కావున చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అన్నారు. ఈరోజు జరిగిన ఈ టోర్నమెంట్ లో దేశస్థాయిలో ఆడే క్రికెట్ కు ఏ మాత్రం తీసిపోని రాని విధంగా క్రీడాకారులు తమ ఆటను ప్రదర్శిస్తుంటే,చూసినవారు అంత ఎంతో సంతోషించారన్నారు.ఈ క్రీడా నైపుణ్యాన్ని గ్రామీణ స్థాయి నుండి ఆగిపోకుండా రాష్ట్ర,దేశస్థాయి క్రీడ పోటీలో ఆడే విధంగా మంచి క్రీడాకారులుగా తయారు కావాలన్నారు. క్రీడా పోటీలు నిర్వహించడానికి కిసాన్ పరివార్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని,గతంలో కూడా అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించామని,భవిష్యత్తులో కూడా మా వంతు సహాయ సహకారాలు క్రీడాకారులకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే నాయకులు కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు.క్రీడల్లో గెలుపు,ఓటమిలు సహజమని ఓటమి నుండే గెలుపుని నేర్చుకుని అంచలంచలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండి పాషా,గ్రామ మాజీ సర్పంచ్,కిసాన్ పరివార్ మండల ఇన్చార్జులు వెంకటరమణ,రామ్మూర్తి,శంకర్ నాయక్,రవి,క్రీడాకారులు ఇంకా తదితరులు పాల్గొన్నారు.