ఉత్తమ అవార్డు అందుకున్న బూరుగు రవి గౌడ్
జనగామ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర కళాకారుడు, జనగామ జిల్లా కళా వేదిక అధ్యక్షుడు, స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన బూరుగు రవి గౌడ్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం ఘనంగా సన్మానించారు.బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, మాజీ సైనికుడు డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్, బీసీ జేఏసీ చైర్మన్ చేవెళ్ల సంపత్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించగా, పలువురు నాయకులు బూరుగు రవి గౌడ్‌కు శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల సదానందం, బీసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బూరుగు రవి గౌడ్ మాట్లాడుతూ తనకు ఉత్తమ అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉందని, తనను గౌరవించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.