ఉత్తేజపూరితంగా జరిగిన సిఐటియు జిల్లా 4వ మహాసభ
జనగామ పట్టణంలోని కామాక్షి ఫంక్షన్ హాల్లో సిఐటియు జిల్లా నాలుగవ మహాసభలు ఉత్తేజపూరితంగా జరిగాయి.ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు జెండా ఆవిష్కరణతో ప్రారంభించగా,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎస్వీ రమ మాట్లాడుతూ..“కార్మిక రాజ్యం ద్వారానే కార్మికుల జీవితాల్లో నిజమైన మార్పు వస్తుంది.ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు శ్రామిక వర్గాలపై భారం మోపుతున్నాయి.కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు”అని విమర్శించారు.ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉందని,భవిష్యత్తు ఎర్రజెండాదేనని ఆమె పేర్కొన్నారు.సిఐటియు కార్మిక–కర్షక ఐక్యతతో పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పారు.ఈ మహాసభలో రాష్ట్ర నేతలు బి.మధు,పి.శ్రీకాంత్,యాటల సోమన్నతో పాటు జిల్లాలోని 12 మండలాల నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు