
డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు ఎంపెల్లి ముత్తే ష్ ఆ
ప్రింటు, ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ లో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ:
హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద గురువారం డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు ఎంపెల్లి ముత్తే ష్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు.
ఏప్రిల్ 13వ తేదీ న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన జర్నలిస్టుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి,ఆలిండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్,డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కే రాజేంద్రప్రసాద్,బొడ్డు అశోక్, చార్వక,తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు వేముల యాదగిరి,బాబన్న తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా మారిందని,
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు వార్తలు రాసి ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులతో పాటు, ఉద్యమ వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో, డెస్క్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం కార్యక్రమం కు ఫోటో, వీడియో,ప్రింట్,ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయ