సాయిచంద్ పార్థీవ దేహానికి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ సాయిచంద్ హఠాన్మరణం బాధాకరమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంతకముందు గుండెపోటు తో మరణించిన సాయి చంద్ మృతదేహానికి మంత్రి ఎర్రబెల్లి ఘన నివాళులు అర్పించారు. వారి మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి, సంతాపం తెలిపారు.