సూర్యోదయంలో పొద్దున పొడి సిందిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై పోరు నడిపిన పల్లె–తమ్మడపల్లి! గుత్పాలమెత్తి రజాకార్లను తరిమిన పల్లె–తమ్మడపల్లి! ఈ పల్లె గుత్పాల తమ్మడపల్లెగా పేరును గాంచిన ధీరభూమి,పోరుబాటనే నేర్పిన పల్లె–తమ్మడపల్లి! చాకలి ఐలమ్మకు తోడుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై రణం నడిపిన పోరాట పల్లె–తమ్మడపల్లి! కమ్యూనిస్టు యోధులను కన్న ధైర్యపు గర్భం–తమ్మడపల్లి! అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని గెలిపించిన పల్లె–తమ్మడపల్లి! కవులు,కళాకారులు వికసించిన ఈ పల్లె,ఉద్యమాల పాఠం నేర్పిన పల్లె–తమ్మడపల్లి! ఎందరో యోధులను కన్న ఈ పల్లె,ఎర్రమందారంలో విరబూసిన కమ్యూనిస్టుల నేల,అమరులై స్వప్నమై కలలుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! కష్టజీవుల అండగా,బ్రతుకు తెరువుకోసం పోరాడిన,శ్రమజీవులకై నిలబడ్డ పోరాట పల్లె-తమ్మడపల్లి! దొంతురి సంతోష్ కుమార్-తమ్మడపల్లి జి-జఫర్ఘఢ్ మండలం-జనగామ జిల్లా
సూర్యోదయంలో పొద్దున పొడి సిందిన పల్లె–తమ్మడపల్లి!
రజాకార్లపై పోరు నడిపిన పల్లె–తమ్మడపల్లి!
గుత్పాలమెత్తి రజాకార్లను తరిమిన పల్లె–తమ్మడపల్లి!
ఈ పల్లె గుత్పాల తమ్మడపల్లెగా
పేరును గాంచిన ధీరభూమి,పోరుబాటనే నేర్పిన పల్లె–తమ్మడపల్లి!
చాకలి ఐలమ్మకు తోడుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి!
రజాకార్లపై రణం నడిపిన
పోరాట పల్లె–తమ్మడపల్లి!
కమ్యూనిస్టు యోధులను కన్న
ధైర్యపు గర్భం–తమ్మడపల్లి!
అన్యాయాన్ని ఎదిరించి
న్యాయాన్ని గెలిపించిన పల్లె–తమ్మడపల్లి!
కవులు,కళాకారులు వికసించిన ఈ పల్లె,ఉద్యమాల పాఠం నేర్పిన పల్లె–తమ్మడపల్లి!
ఎందరో యోధులను కన్న ఈ పల్లె,ఎర్రమందారంలో విరబూసిన కమ్యూనిస్టుల నేల,అమరులై స్వప్నమై
కలలుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి!
కష్టజీవుల అండగా,బ్రతుకు తెరువుకోసం పోరాడిన,శ్రమజీవులకై నిలబడ్డ
పోరాట పల్లె-తమ్మడపల్లి!
దొంతురి సంతోష్ కుమార్-తమ్మడపల్లి జి-జఫర్ఘఢ్ మండలం-జనగామ జిల్లా