
కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టింగ్ ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఫస్ట్ Anms అండ్2nd anms గా పనిచేస్తున్న వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈఅసెంబ్లీ సమావేశాలలో నిర్ణయం తీసుకోవాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి సిఐటియు జనగామ జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈరోజు ఉదయం జనగామ పోలీసులు సిఐటియు సిపిఎం నాయకులను అలాగే గ్రామపంచాయతీ మెడికల్ అండ్ హెల్త్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి జనగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈసందర్భంగా బూడిద గోపి మాట్లాడుతూ గత నెల రోజులుగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు అన్ని చెత్తాచెదారం మురికి నీటితో నిండిపోయాయని క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్మికుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంతో పరిశీలించి తక్షణ పరిష్కరించాల్సింది పోయి సమస్యలు మరింత జఠిలం కావడానికి కారణం అవుతుందని దుయ్యబట్టారు. పంచాయతీ కార్మికులు చేసే సేవలు కన్నతల్లి లాంటివని అలాంటి వారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్న పోలియో చుక్కలు కంటి వెలుగు జ్వరం సర్వేలు అనేక ఆరోగ్య కార్యక్రమాలు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి నిర్వహిస్తున్న ఏఎన్ఎం లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం సరైన కాదు అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా వీరికి కూడా అన్ని సౌకర్యాలు వర్తింపజేయాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న మరొక ముఖ్యమైన కార్యక్రమం మిషన్ భగీరథ దేవాదుల నీటి పారుదల ప్రోగ్రామ్స్ ను పంప్ హౌస్ లో ఉండే పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని తక్షణం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు……
ఈకార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సుంచు విజయేందర్ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు సిహెచ్ మల్లాచారి మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు స్వప్న అనిత రాజకుమారి బి అనిత కే స్వరూప దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు కొత్తపెళ్లి రవి గంట శ్రీనివాస్ కురుసం బాబు మాలోత్ శంకర్ పోలేపాక బాబు ప్రవీణ్ తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.
అనంతరం జనగామ పోలీస్ సిఐ ఎల్ల బోయిన శ్రీనివాస్ యాదవ్ ఎస్ఐ సృజన్ కుమార్ గార్లు అరెస్ట్ అయిన వారిని సొంత పూచికత్తుపైన విడుదల చేశారు