
బెల్లంకొండ సత్యనారాయణ సిపిఎం మండల కార్యదర్శి
ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నారని ప్రతి మనిషికి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని చాకిరేల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి ఆయన మాట్లాడుతూ ఈ మండుటెండలో రోజు కూలి 100 రూపాయలు ఇయ్యటం దారుణమని అన్నరు,
బీజేపీ పాలనలో ఉపాధి హామీకి మొత్తం బడ్జెట్ వ్యయంలో కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. మొత్తం బడ్జెట్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ 2009లో 3.4 శాతం ఉండగా, ప్రస్తుత బడ్జెట్లో 1.3 శాతానికి పడిపోయింది. ఇది ఉపాధి సంక్షోభాలకు దారితీస్తుంది. ఈ పరిమితి ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రాథమిక స్వభావానికి విరుద్ధం.
ఆర్థిక మందగమనం, కరోనా లాక్డౌన్ సమయంలో గ్రామీణ భారతదేశంలో ఉపాధిని అందించడంలో ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ఎంతో ఉపకరించింది. గ్రామీణ ప్రజానీకంలోని నిరుపేద, అత్యంత అణగారిన వర్గాల మనుగడకు సహాయపడింది. అదే సమయంలో వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కార్మికుల సాధారణ వేతనాలు తగ్గకుండా నిరోధించింది.
ప్రతి ఇంటి ఆదాయం, వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తి సంబంధిత వ్యయంపై ‘ఎంజీఎన్ఆర్ఈజీఏ’ సానుకూల ప్రభావం చూపిందని భారత ఆర్థిక సర్వే- 2023 పేర్కొన్నది. కానీ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను గుర్తించకుండా ఈ పథకాన్ని రద్దు చేయాలని కుట్రలు పన్నుతున్నది అని అన్నరు .
ఉపాధిహామీ పథకాన్ని నీరు గార్చేందుకు కేంద్రం 2023-24 యూనియన్ బడ్జెట్ కేటాయింపుల్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి భారీ కోత విధించింది. ఈ ఏడాది కేటాయింపులు రూ. 60,000 కోట్లు మాత్రమే కాగా, 2023లో సవరించిన అంచనా రూ.89,400 కోట్లు, ప్రస్తుత బడ్జెట్ అంచనా రూ.73,000 కోట్లు. సాధారణంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ బడ్జెట్లో 20 శాతం కంటే ఎక్కువ గత సంవత్సరాల్లోని బకాయిలను చెల్లించడానికే ఖర్చవుతుంది. వంద రోజుల పని కల్పించేందుకు ఉపాధి హామీ పథకానికి రూ.2.72 లక్షల కోట్లు అవసరమని ఒక అంచనా.
బీజేపీ పాలనలో ఉపాధి హామీకి మొత్తం బడ్జెట్ వ్యయంలో కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. మొత్తం బడ్జెట్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ 2009లో 3.4 శాతం ఉండగా, ప్రస్తు త బడ్జెట్లో 1.3 శాతానికి పడిపోయింది. ఇది ఉపాధి సంక్షోభాలకు దారితీస్తుంది. ఈ పరిమితి ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రాథమిక స్వభావానికి విరుద్ధం. దీన్నొక సాధారణ సంక్షేమ పథకంగా చూడటం వల్ల ఏడాదిలో పనిదినాలు కూడా తగ్గుతాయి. ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రకారం ఏడాదిలో కనీసం వంద రోజుల పని కల్పించడం. కరు వు, ఇతర కష్టాల పరిస్థితుల్లో పని దినాలను పెంచే నిబంధన కూడా ఉన్నది. కానీ వంద రోజుల పనిని పొందుతున్న కుటుంబాలు చాలా తక్కువ. పనికి డిమాండ్ ఉన్నప్పటికీ, 2021-2022 ఏడాదిలో సగటు పని దినాలు 49.7 రోజులు మాత్రమే. ఇది కేటాయించిన పనిదినాల్లో సగం కంటే తక్కువ. ఈ ఏడాది సగటున పనిదినాలు 42 మాత్రమే. అంటే 100 రోజుల పనిని 10.488 లక్షల కుటుంబాలకు మాత్ర మే అందించారు. ఇది మొత్తం జాబ్ కార్డుల్లో 0.61 శాతం, క్రియాశీల జాబ్ కార్డుల్లో ఒక శాతం మాత్రమే.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉన్నది. మొత్తం రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 24 రాష్ర్టాల్లో పెరుగుదల ఐదు శాతం కంటే తక్కువగా ఉన్నది. మొత్తంగా రోజుకు రూ.4 నుంచి రూ.21 వర కు వేతనాలు పెంచారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ వేతనాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 18 రాష్ర్టాలకు ఇంకా రూ.4,700 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నది.
2023 జనవరి 1 నుంచి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేయాలని గ్రామీణాభివృద్ధి మం త్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే సర్వర్ పనిచేయకపోవడం, మొబైల్ ఫోన్లు యాప్‌కు సరిపోకపోవడం, ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వంటి వివిధ సాంకేతిక సమస్యల కారణంగా 40 శాతం కంటే ఎక్కువ పంచాయతీ లు ఆన్లైన్ హాజరును నివేదించలేదు. మొత్తం 2,69,637 పంచాయతీల్లో 1,58,390 మాత్రమే ఆన్లైన్ హాజరును నివేదించాయి. ఎన్ఎంఎంఎస్లో మొత్తం 3,83,421 మేట్ లు నమోదు చేయబడ్డారు. అయితే ఇప్పటివరకు 99,687 నమోదిత పరికరాలను మాత్ర మే హాజరు నమోదు చేయడానికి ఉపయోగించారు. ఇది 25.9 శాతం మాత్రమే.
బీజేపీ పాలనలో ఉపాధి హామీకి మొత్తం బడ్జెట్ వ్యయంలో కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. మొత్తం బడ్జెట్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ 2009లో 3.4 శాతం ఉండగా, ప్రస్తుత బడ్జెట్లో 1.3 శాతానికి పడిపోయింది. ఇది ఉపాధి సంక్షోభాలకు దారితీస్తుంది. ఈ పరిమితి ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రాథమిక స్వభావానికి విరుద్ధం.
2023 ఫిబ్రవరి 1 నుంచి అన్ని చెల్లింపులకు ఆధార్-ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)ని ఉపయోగించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కార్మికులకు ఏబీపీఎస్ పద్ధతిని ఉపయోగించి చెల్లింపులు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం 44 శాతం మంది కార్మికులు మాత్రమే ఏబీపీఎస్ కింద చెల్లింపులకు అర్హులు కావడంతో 56 శాతం మంది ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు పడనున్నారు అని అన్నా రు . కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఉపాధి హామీ పథకంలో పని దినాల సంఖ్యను 200 రోజులకు పెంచాలి. పనికోరే వారందరికీ పని కల్పించాలి. రోజుకు రూ. 600లు వేతనం చెల్లించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీకూలీలు, కళింగ రావు, ముత్యాలు,లక్ష్మి,జయమ్మ,మనీ కుమారి,నాగలక్ష్మి,విజయలక్ష్మి, ఈదమ్మ, ఎంకన్న, లక్ష్మి, రాణి, నాగమ్మ,తదితరులు పాల్గొన్నారు.