
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీనివాస్•••
కూలీలు కన్నెర చేస్తే బిజెపి గద్దె దిగాల్సిందే÷డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్.బషీరుద్దీన్….
తిరుమలాయపాలెం జూన్ 23,2023…..
ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తే సహించేది లేదని, కూలలతో పెట్టుకుంటే కూలిపోవటం తజ్జమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీను, జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ అన్నారు.
స్థానిక తిరుమలాయపాలెం పిండిపోలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథక పనులను పరిశీలించారు, అనంతరం ఉపాధి హామీ పనుల కార్మికులతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నెరవేరియం చేసే దానికోసం బిజెపి ప్రభుత్వం చూస్తుందని దానికోసమే బడ్జెట్లో నిధులు తగ్గించారని వారి సందర్భంగా తెలియజేశారు. యూపీఏ గవర్నమెంట్ లో 40 కోట్ల మంది ఉపాధి హామీ పథకంలో పని చేశారని, 15 కోట్ల మంది పనిచేస్తున్నారని వారు చెప్పారు. బెంగాల్ లాంటి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం రద్దు చేశారని రేపు ఇదే దేశవ్యాప్తంగా చేయబోతున్నారని అందుకే జాగ్రత్తగా ఉండాలని వాళ్లు హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం యూపీ గవర్నమెంట్ లో సిపిఎం పోరాట ఫలితంగా వచ్చిందని వాళ్ళు ఈ సందర్భంగా గురి చేశారు. చేయకపోతే ఈ పథకం చేయి జారిపోతుంది అని అందుకే కూలీలు కన్ను ఎర్రజేసి బిజెపి గవర్నమెంట్ ఈ సందర్భంగా వాళ్లు పిలుపునిచ్చారు. కులాలతో పెట్టుకుంటే పతనం ఖాయమని ఈ సందర్భంగా వారు బిజెపి గవర్నమెంట్ హెచ్చరించారు.
భవిష్యత్తులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే పోరాటాల్లో వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 26వ తారీఖున మండల కేంద్రాల ముందు ధర్నాలు జరుగుతున్నాయని, ఈ తిరుమలయపాలెం మండలం కూడా 26వ తారీకున జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు, కార్మికులు పేదలు పాల్గొనని సందర్భంగా పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కెవిపీఎస్ కెవిపిఎస్ జిల్లా నాయకులు కొమ్ము శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు నెర్సుల వెంకటేష్, కొమ్ము వెంకన్న, బచ్చలకూర రాములు, రాము, నాగాటి సురేష్, పప్పుల ప్రసాద్, పప్పుల ఉపేందర్, పిట్టల పాపారావు తదితరులు పాల్గొన్నారు.