
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలుబి. ప్రసాద్
ఆహార ఉత్పత్తుల ధరలు 11 శాతం పెరిగితే ఉపాధి వేతనం పెరుగుదల రెండు శాత మా?
పార్లమెంట్ సభ్యు లకు పెంచుకున్నట్లు మూడవ వంతు వేతనాలను కూలీలకు పెంచాలి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలుబి. ప్రసాద్
కోదాడ:ఆహార వస్తువుల ధరలు 11%, నిరుద్యోగం రేటు ఏడు శాతం పెరిగిందని చెప్పిన కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పక్కనపెట్టి ఉపాధి కూలీల కనీస వేతనాన్ని ఏడు రూపాయలకు పెంచడం గ్రామీణ పేదలను అవమానించడమే అవుతుందని, పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం ఉన్న వేతనంలో మూడో వంతు వేతనాన్ని అదనంగా పెంచుకున్నట్లు ఉపాధి కూలీల వేతనాన్ని కూడా సవరించి అదే మాదిరి పెంచాలని , ఆహార ఉత్పత్తుల ద్రవయోల్బణం 11 శాతం పెరిగితే కూలీల వేతనాలను రెండు శాతానికి పెంచడం భారతదేశ సిగ్గుపడే అంశం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలుబి. ప్రసాద్అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ లోని సుoదరయ్య భవన్ లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్ షాప్ కు ముఖ్య అతిధిగా ఆయనహాజరై మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 26000 లను అమలు చేయాలని చెప్పిన డైరెక్షన్ కూడా పార్లమెంట్ పరిగణలో తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు అమలు అమలు చేస్తున్నట్లు రోజు కూలి ఎనిమిది వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.
2022 నుండి2025 మధ్య గోవాలో గరిష్టంగా 10.56% వేతనం పెరిగి 400 రూపాయలకు చేరిందని అదే కాలంలో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో 3.02 శాతానికి మాత్రమే వేతనం పెరిగిందని , తెలంగాణ రాష్ట్రంలో 300 రూపాయల నుండి 307 రూపాయలకు మాత్రమే పెరిగింది . ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం అమలు చేసే పనిలోనే వేతన వ్యత్యాసాలు ఉండటం. ఈ రకమైన నిర్ణయం పెద్ద ఎత్తున ఆర్థిక అసమానతలు పెరగడానికి దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సామాజిక,ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ పునరాలోచన చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని ఎనిమిది వందల రూపాయలకు పెంచాలని పని దినాలను 200 రోజులకు పెంచాలని పట్టణ ప్రాంతాలకు పనిని విస్తరింప చేయాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెల్లిందని ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న వీటికి ఇచ్చిన హామీని అమలు చేయడం లో గోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు అధ్యక్షుత న జరిగిన జరిగినఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘo జిల్లా ప్రధాన కార్యదర్శిమట్టిపల్లి సైదులు, సీఐటీయూ జిల్లా నాయకులు మిట్టకడుపుల ముత్యాలు, బి.స్వరాజ్యం,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వర్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లానాయకులు పులుసు సత్యం, పోసల బోయినహుసన్, సిరికోoడ శీను, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, నారసాని వెంకటేశ్వర్లు, దోసపాటి బిక్షం, గుడిగె ధనుంజయ్ గౌడ్, జంపాల స్వరాజ్యం, షేక్ సైదా హుస్సేన్, బత్తుల రవి, పులసరి వెంకట ముత్యం, ఆరే రామకృష్ణారెడ్డి, ముత్తయ్య, శీగా శ్రీను, చెన్న బోయిన వీరయ్య, జి. శీను తదితరులు పాల్గొన్నారు.