
ఉప్పుగల్లులో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

ఈ69న్యూస్:-జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో శ్రీవారి దయాపాత్రంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించిన ఈ మహోత్సవంలో భక్తుల సందడి అలరించింది.వేదపండితుల మంత్రఘోషల మధ్య సీతారాముల కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగి, గ్రామమంతా దైవికతతో నిండిపోయింది. గ్రామస్థులు, వివిధ కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాలు, మహిళలు మరియు పిల్లలు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి కల్యాణ దృష్టిని పొందారు.కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ యువకులు మరియు సంఘాల సభ్యులు సమిష్టిగా కృషి చేశారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం గ్రామ భక్తుల ఐక్యతను ప్రతిబింబిస్తూ ఎంతో ఆధ్యాత్మికంగా కొనసాగింది.