
ఉప్పుగల్ గ్రామంలో పర్యటించిన బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు(వెంకన్న)జఫర్గడ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామాన్ని సందర్శించి,ప్రజల సమస్యలను పరిశీలించారు.పర్యటనలో గ్రామంలోని అంతర్గత రోడ్ల సమస్యలు,అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ వంటి అంశాలను గుర్తించారు.వీటికి సంబంధిత అధికారుల దృష్టి ఆకర్షించి,పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం,వేదికపై చాయ్ చర్చలో కూడా పాల్గొన్నారు.అంతేకాక,జిల్లా సీనియర్ నాయకుడు బుర్ర తిరుపతి గౌడ్ కుమార్తె సంకీర్తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జఫర్గడ్ మండల బిజెపి అధ్యక్షులు కోరుకొప్పుల నగేష్ గౌడ్,మాజీ సర్పంచ్ గాదెపాక చిరంజీవి,శక్తి కేంద్ర ఇంచార్జి బైరి పవన్ గౌడ్,ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నేరొళ్ళ రాజు,ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లందుల సారయ్య,మండల అధ్యక్షులు గాదెపాక శ్రీను,సీనియర్ నాయకులు సిల్వర్ రాజయ్య,పొనుగోటి గోపాల్ రావు,మాజీ మండల ప్రధాన కార్యదర్శి గోదారి సాయిరాం,బూత్ అధ్యక్షులు తీగారపు బుచయ్య,శ్రీనివాస్,రత్నం తదితరులు పాల్గొన్నారు