
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
పూలను దైవంగా భావిస్తూ ప్రకృతిని కాపాడుతూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పాటిస్తూ ప్రతి ఇంట్లో జరుపుకునే గొప్ప పండుగ సద్దుల బతుకమ్మ,భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.రేగొండ, కొత్తపల్లి గోరి,రావులపల్లి గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి సెంటర్లలో మహిళామణులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంగిలి పూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులతో గౌరమ్మను పూజిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఇంటిలో జరుపుకునే పండుగను తెలంగాణ సాంప్రదాయ జానపద పాటలతో సోదరీమణులు నృత్యాలు చేస్తూ గౌరమ్మను కొలుస్తూ తమ భక్తిని చాటుకున్నారు.రేగొండ మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ ఆటస్థలాలను రేగొండ మండలంలో ఎస్సైలు రాజేష్,సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి లు, కొత్తపల్లి గోరి మండలంలో ఎస్సై లు సాకాపురం దివ్య, షా ఖాన్ లు పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా పోలీస్ పహారా నడుమ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.