
ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా నాయకురాలు సునీత
-ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా నాయకురాలు సునీత
గళం న్యూస్, గుత్తి,
గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం ఎండిలిబండ, కొత్తపేటలో ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా నాయకురాలు సునీతఎన్నికల ప్రచారం చేశారు. ఒక ఓటును ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాంకు మరొక ఓటును ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణకు ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పామిడి మండల యూత్ లీడర్ జె.రాజేష్,మండల అధ్యక్షుడు ఈ. నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు ఏ.నాగరాజు,ఏగువపల్లి పవన్ కళ్యాణ్, నెమల్లపల్లి వెంకట రాముడు, గుత్తి సుభాషిని, ఎంగిలిబండ దుర్గమ్మ, అపర్ణ, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.