
-సిపిఐ మండల కార్యదర్శి జువారి రమేష్
-సిపిఐ మండల కార్యదర్శి జువారి రమేష్
ఘనపూర్ రిజర్వాయర్ నీళ్లతో చెరువులు కుంటలు నింపి పంటలకు నీళ్ళు ఇవ్వాలని అలాగే ఎండిపోయిన పంటలకు ఎకరాకు 10వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ పార్టీ జఫర్ఘడ్ మండల కార్యదర్శి జువారి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.మండలంలోని ఓబుళాపురం ముఖ్దుంతండా గ్రామంలోఎండిపోయినా పంటలను భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించాడు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో దేవాదుల వరదకాలువ ద్వారా చెరువులు కుంటలు నింపి రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నీళ్లను రైతాంగానికి విడుదల చేసి పంటపొలాలను కాపాడాలని అధికారులను కోరారు.రైతులపై సోయి లేని ప్రభుత్వం కూలిపోయింది.ఈ ప్రభుత్వం అయినా ఆదుకోవాలని ఆయన కోరాడు.ఎన్నో పెట్టుబడులు అప్పులు చేసి పంటల మీద ఆశపడి పెడితే నోటి కొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్నలు అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులున్నాయని,ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎండిపోయినా పంటలకు ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు.వ్యవసాయ అధికారులను క్షేత్ర స్థాయిలో పంపి పంటల అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మండలంలో ఎగువ ప్రాంతలైనా గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావులు ఎండిపోయిన పరిస్థితి నెలకొంది పశువులకు తాగడానికి నీరు దొరికే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయన్నారు.ఉప్పుగళ్లురిజర్వాయర్ నుండి పాలకుర్తి రిజర్వాయర్ కి వెళ్లే వరదకాలువ పనులు నత్తనడకనా నడుస్తున్నాయని సత్వరమే పనులు వేగవంతం చేసి రైతుల్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్శన కార్యక్రమంలోరైతులు బానోత్ లింగనాయక్ బానోత్ దేవనాయక్ బుచ్చన్న నాయక్ దుర్గా సింగ్ మోతిలాల్ బానోత్ స్వామినాయక్ టిక్యా అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.