ఈ69న్యూస్ వరంగల్:-ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఒక్కపూట పని విధానాన్ని అమలుచేస్తూనే,భోజన సౌకర్యం కల్పించడం ప్రారంభించారు.బుధవారం 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్ స్వయంగా కార్మికులకు భోజనం వడ్డించి,వారితో పాటు భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గంట సత్యనారాయణ రెడ్డి,ఖిల్లా వరంగల్ మండల అధ్యక్షులు వడ్డేపల్లి ప్రకాష్,జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కలకుట్ల రవీందర్,సానిటరీ ఇన్స్పెక్టర్ వస్కుల కరుణాకర్,జీడబ్ల్యూఎంసీ జవాన్లు శ్రీధర్,ప్రశాంత్,రవి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్మికులు తమ కృతజ్ఞతలు తెలిపారు.