telugu galam e69news local news daily news addagudur news
హర్షం వ్యక్తం చేసిన అడ్డగూడూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
( గళం న్యూస్ అడ్డగూడూరు)
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పట్టణానికి గతంలో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్న సమయంలో ఎంపీ నిధుల నుంచి విద్యుత్ ద్వీపాలకు 2,20,000 /- రూపాయలతో అడ్డగూడూరు గ్రామ పంచాయతీకి మంజూరు చేశారు, విద్యుత్ విధి దీపాలు అడ్డగూడూరు పట్టణానికి మంజూరు చేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు, బుధవారం నాడు అడ్డగూడూరు పట్టణంలోని ప్రధాన కూడలిలో విద్యుత్ ద్వీపాలను ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పూలపల్లి సోమిరెడ్డి, గూడెపు పాండు, మారిశెట్టి మల్లేష్, బాలెంల సాగర్, నాగులపల్లి రమేష్, బాలెంల సురేష్ , కడారి రమేష్, చుక్క యాదగిరి, బండారి నవీన్,ఆసర్ల బీరుమల్లు , పూల పెళ్లి కుశలావు రెడ్డి, ఆసర్ల మత్స్యగిరి, డప్పు యాదగిరి,పయ్యావుల సాయికుమార్, నాగులపల్లి బీరప్ప, బాలెంల మహేందర్, పరశురాములు , విష్ణు తదితరులు పాల్గొన్నారు