
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోజు వేయి స్థంబాల గుడి నుండి భారి ర్యాలితో బయలుదేరి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి నామినేషాన్ దాఖలు చేసారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
👉యువకుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను, విద్యార్థులను నిర్వీర్యం చేసింది.
👉TSPSC వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
👉ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో తమ కళలు సాకారం చేసుకుందామంటే నిరాశే మిగిలింది.
👉గత 15 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వము నుండి ఎలాంటి నిధులు రావటం లేదు. ఎంతో కొంత వచ్చిన కూడా అవి సొంత ప్రయోజనాల కోసం సమకూర్చుకోవడానికే ఉపయోగించుకున్న స్థానిక ఎం.ఎల్.ఏ.
👉విభజన చట్టంలో పొందుపరచిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందింది ఈ ప్రభుత్వాలు ప్రజలకు ప్రజలు ఎప్పుడూ నిర్బంధం భయభ్రాంతులతో బ్రతకవలసిన దుస్థితి.
👉ఈ నియోజకవర్గం రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల కంటే ఎంతో వెనుకబడిపోయింది రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ స్థానంలో ఉండవలసిన హనుమకొండ వరంగల్ కాజిపేట్ సిటీ ఎంతో వెనుకబడిపోయింది.
👉ప్రజలకు, ప్రజల ఆస్తులకు, ఇండ్ల స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో సాధించిన ప్రగతి స్వరాష్ట్రంలో ఆగిపోయింది.
👉బిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన అమలు చేస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు నిరుద్యోగ యువకులకు కార్పొరేషన్ రుణాలు బందు చేసిండ్రు
👉హనుమకొండ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలోనే 28వ స్థానానికి నెట్టివేసినారు.
👉రాష్ట్రంలోని ప్రభుత్వ విద్య వైద్య సంస్థలను నిర్లక్ష్యం చేసి ప్రజలకు అక్కరకు రాకుండా వాటి పట్ల విశ్వాసము లేకుండా చేసిండు.
👉హనుమకొండ డ్రైనేజీ కాలువలు రోడ్లమీద పారుతున్నవి. కాకతీయ యూనివర్సిటీని బ్రష్టు పట్టించారు. నగరంలోని ముఖ్యమైన ప్రభుత్వ ఖాలీ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు.
👉హనుమకొండ సిటీని డల్లాస్ చేస్తానని ఖల్లస్ చేసి పట్టణాన్ని సిరిసిల్ల, సిద్దిపేట కంటే వెనుకబడేసినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ ట్రై సిటీని కక్షతో నిర్లక్ష్యం చేసినారు
👉కట్టించిన డబల్ బెడ్ రూమ్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. హనుమకొండ నిరుద్యోగులకు పట్టుమని పదిమందికి ఉద్యోగం కల్పించలేదు. ఏ ఒక్క విద్యాసంస్థను పునరుద్ధరించలేదు.
👉ఆర్ఎస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవద్దని, అధికారం కోసం వీరు ఎంతకైనా తెగిస్తారని, తొమ్మిది నర సంవత్సరాలల్లో చేయనిది ఎప్పుడు ఏం చేస్తారో ప్రజలు, విద్యావంతులు మేధావులు గమనించాలి
👉సిఎం. కేసిఆర్, ఎం.ఎల్.ఏ వినయ్ భాస్కర్ ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆర్భాటాలు, అబద్దాలు మాయమాటలతో పరిపాలన కొనసాగించారు.
👉వినయ్ భాస్కర్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాజీపేటకు బస్టాండ్ జూనియర్ కాలేజి కావాలని కొట్లాడినవు కదా మరి ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది మరి ఎందుకు నువ్వు తేలేక పోయావు
👉కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రాగానే మాహలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం మరియు చేయూత ఈ 6 గ్యారంటీ స్కీం లను తక్షణమే అమలు చేస్తాము
👉కాంగ్రెస్ పార్టీ ఏదయితే చెబుతుందో అది ఖచ్చితంగా చేస్తుంది ఇది వరకు చేసాము ఇప్పుడు చేస్తాం. కాబట్టి ప్రజలందరు మోసపూరిత బిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవా లని అన్నారు
👉తెలంగాణా ప్రత్యెక రాష్ట్ర కళను సాకారం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలి
👉వరంగల్ పశ్చిమ ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, కవులు కళాకారులు నగర ప్రజలు నన్ను ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేసి ఎం.ఎల్.ఏ.గా గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీఐ వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జి రవీంద్ర ఉత్తమ రావు దల్వి, వరంగల్ వెస్ట్ ఏ.ఐ.సి.సి. ఇంచార్జి సంజయ్ జాగీర్దార్, ఏఐసీసీ సభ్యులు కొండపల్లి దయాసాగర్, రాష్ట్ర వఖ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఖుస్రు పాష , టిపిసిసి ఉపాధ్యక్షురాలు బండ్రు శోభా రాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎం.పి. రాజయ్య, వై.ఎస్.ఆర్ పార్టీ నాయకులు కౌటిల్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, మాజీ కార్పొరేటర్లు నసీం జాహన్, అబూబకర్, సుంచు అశోక్, ఏ. నాగరాజు, బుద్ధా జగన్, గుంటి కుమార్, సీనియర్ నాయకులు పులి రాజు, ఎం.వి. రాజు, టిపిసిసి మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రహీమున్నిసా బేగం, కర్రే బిక్షపతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, జిల్లా ఎస్.సి డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, జిల్లా ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ బోమ్మతి విక్రమ్, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ తోట వెంకట రాజ్ కుమార్, జిల్లా AIUEWC జిల్లా చైర్మన్ గుంటి స్వప్న,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాద్యక్షురాలు అలువాల కార్తిక్, INTUC జిల్లా చైర్మన్ కూర వెంకట్. జిల్లా NSUI అధ్యక్షుడు పల్లకొండ సతీష్, జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డి నేటర్ కేతిడి దీపక్ రెడ్డి, ఎం.వి. సమతా రాజు, నాగపురి లలిత, జంగా సులోచన, తాళ్ళపల్లి మేరీ, టి మానస మధు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బంక సంపత్, అంబేద్కర్ రాజు, పల్లె రాహుల్ రెడ్డి, మహమ్మద్ ముస్తాక్ నేహళ్ తదితరులు పాల్గొన్నారు.