ఈరోజు కేడీసీ కాకతీయ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకతీయ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మిశ్రీన్ సుల్తానా మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఫోర్త్ మరియు సెకండ్ సెమిస్టర్ రిజల్ట్ లో కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కె డి సి కళాశాల విద్యార్థుల రిజల్ట్ న్యాయపరంగా రాలేదని, అదేవిధంగా కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పూర్తి పాస్ పర్సంటేజ్ కనీసం 50% వరకు కూడా లేదని తెలియజేశారు. అదేవిధంగా అదే కళాశాలకు చెందినటువంటి ఓకే గ్రూప్లో 162 మంది విద్యార్థులు ఉండగా 136 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాయగా కేవలం 26 మంది మాత్రమే అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులు అయ్యారని తెలియజేశారు. అంతేకాకుండా ఆ గ్రూప్ కి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ రెండు కామన్ సబ్జెక్టులలో దాదాపు అందరూ ఫెయిల్ అయినట్టు తెలిపారు మరియు విద్యార్థులలో మిగిలిన సబ్జెక్టులలో ఔట్ స్టాండింగ్ రిజల్ట్ ఉన్నప్పటికీ ఆ రెండు సబ్జెక్టులలో మాత్రం ఫెయిల్ అయినట్టు తెలియజేశారు. అదేవిధంగా థార్డ్ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫీజు కట్టినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇన్వ్యాలిడ్ హాల్ టికెట్ చూపిస్తుందని అడిషనల్ కంట్రోలర్ తో మాట్లాడడం జరిగింది. అంతేకాక యూనివర్సిటీలో రీవాల్యుయేషన్ ఫీజులు, ఓపెన్ చాలెంజ్ ఫీజులు తక్కువ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.
ఈ ఆందోళనకు ఫలితంగా కాకతీయ విశ్వవిద్యాలయం అడిషనల్ కంట్రోలర్ విద్యార్థులతో మాట్లాడుతూథార్డ్ సెమిస్టర్ ఫీజు కట్టిన తర్వాత కూడా ఇన్వాల్వ్ వచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఉన్నటువంటి విద్యార్థులకు తిరిగి రిజల్ట్ ను పోస్ట్ చేస్తామని మరియు ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా ఆబ్సెంట్ అని పడినటువంటి విద్యార్థుల యొక్క సమాచారాన్ని సేకరించి వారి జవాబు పత్రాన్ని తిరిగి వాల్యుయేషన్ చేసి రిజల్ట్ ని పోస్ట్ చేస్తామని తెలియజేస్తూ, మిగిలిన ఇచ్చినటువంటి డిమాండ్లను అధికారులతో చర్చిస్తామని విద్యార్థులకు సమాధానం ఇవ్వడం జరిగింది.