ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులు నింపేందుకు చర్యలు తీసుకోవాలి
సాగర్ ఎడమ కాలుకు నీరు విడుదల చేసినందున ఆదివారం నీరు మునగాల హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కాలువ మీద మానిటరింగ్ డ్యూటీలు నిర్వహిస్తున్న తహసిల్దార్ ఆంజనేయులు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ తో పాటు ఇతర సిబ్బందిని కలిసి సమస్యను వివరించడం జరిగిందని సామాజిక కార్యకర్త గంధం సైదులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ పరిధిలోని ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులు నింపి ఇక్కడ ప్రజల దాహార్తిని తీర్చే విధంగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి గ్రామాల్లో తాగునీటి తీవ్ర సమస్య ఏర్పడింది. గతంలో కాలువకు వారం రోజులపాటు నీరు విడుదల చేసినప్పటికీ చెరువులు నింపాలని కోరడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నీరు విడుదల చేసి చెరువులు నింపలేదు. ప్రస్తుతం మళ్లీ తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సవినయంగా కోరడం జరిగింది. ఇప్పటికైనా కాల్వ పరిధిలో ఉన్న ద్వారా మునగాల మండలం తో పాటు తోపాటు అన్ని మండలాల్లో మూడు రోజులపాటు చెరువులు నింపి సమస్య పరిష్కరించాలని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలను కూడా కోరుతున్నాను.