కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని,వెంటనే ఎన్కౌంటర్లను ఆపి మావోయిస్టులతో చర్చలు ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.గురవారం రోజు సిపిఎం జనగామ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన..దేశంలోని అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు నక్సలైట్ల పేరుతో ఆపరేషన్ కగార్ నిర్వహించడం,ఎన్కౌంటర్ల ద్వారా నరమేధం సృష్టించడం సరైంది కాదని మండిపడ్డారు.రాజ్యాంగం ప్రకారం నేరస్తులను అరెస్ట్ చేసి కోర్టులో ఆధారాలు నిరూపించి శిక్ష విధించాలిగాని,అమానుష చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు.పార్లమెంటు మెజారిటీ అంటే దేశాన్ని ఇష్టానుసారం నడపడానికి కాదని,గతంలో అలాంటి నియంతృత్వపు ప్రభుత్వాలు చరిత్రలో కలిసిపోయినట్లే నరేంద్ర మోడీ ప్రభుత్వానికీ అదే గతి ఎదురవుతుందని హెచ్చరించారు.దేశంలో నిరుద్యోగం,పేదరికం,ఆర్థిక అసమానతలు,దోపిడీ ఉన్నంతకాలం తిరుగుబాట్లు ఆగవని జాన్ వెస్లీ అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయాలని కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి దోహదం అవుతుందన్నారు.గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ అభ్యర్థులను ప్రజలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను వెంటనే జమ చేయాలని,అవసరమైన ఎరువులు,విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని,రైతులకు తక్షణమే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సాంబరాజు యాదగిరి,రాపర్తి రాజు,బోట్ల శేఖర్,జోగు ప్రకాష్,పుత్కనూరి ఉపేందర్,బోడ నరేందర్,ఎండి అల్లారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని,వెంటనే ఎన్కౌంటర్లను ఆపి మావోయిస్టులతో చర్చలు ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.గురవారం రోజు సిపిఎం జనగామ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన..దేశంలోని అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు నక్సలైట్ల పేరుతో ఆపరేషన్ కగార్ నిర్వహించడం,ఎన్కౌంటర్ల ద్వారా నరమేధం సృష్టించడం సరైంది కాదని మండిపడ్డారు.రాజ్యాంగం ప్రకారం నేరస్తులను అరెస్ట్ చేసి కోర్టులో ఆధారాలు నిరూపించి శిక్ష విధించాలిగాని,అమానుష చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు.పార్లమెంటు మెజారిటీ అంటే దేశాన్ని ఇష్టానుసారం నడపడానికి కాదని,గతంలో అలాంటి నియంతృత్వపు ప్రభుత్వాలు చరిత్రలో కలిసిపోయినట్లే నరేంద్ర మోడీ ప్రభుత్వానికీ అదే గతి ఎదురవుతుందని హెచ్చరించారు.దేశంలో నిరుద్యోగం,పేదరికం,ఆర్థిక అసమానతలు,దోపిడీ ఉన్నంతకాలం తిరుగుబాట్లు ఆగవని జాన్ వెస్లీ అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయాలని కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి దోహదం అవుతుందన్నారు.గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ అభ్యర్థులను ప్రజలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను వెంటనే జమ చేయాలని,అవసరమైన ఎరువులు,విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని,రైతులకు తక్షణమే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సాంబరాజు యాదగిరి,రాపర్తి రాజు,బోట్ల శేఖర్,జోగు ప్రకాష్,పుత్కనూరి ఉపేందర్,బోడ నరేందర్,ఎండి అల్లారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.