ఎమ్మెల్యే జర ఈ పేదలను చూడండి
గత 24వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు మూడో విడత లబ్ధిదారులు నిరసన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే గారు జరిపేదలను చూడండి ఓటేసేది ఈ పేదవాళ్లే కదా కాబట్టి వారిని పట్టించుకోండి మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల పోరాట సంఘం సహాయ కార్యదర్శి అబ్రహం లింకన్ అన్నారు. శనివారం రోజున చిట్యాల ఐలమ్మ నగర్ డబల్ బెడ్ రూమ్ ల వద్ద మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంఘం సహాయ కార్యదర్శి దామెర అబ్రహం లింకన్ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వే పేరుతో కాలయాపన చేస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012 -13 సంవత్సరంలో మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా పట్టాలిచ్చి స్థలాలు చూపించడం మరిచారని నేటి తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన వాళ్లకు 6 నెలల్లోడబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసి నేటికీ ఐదు సంవత్సరాలు కావస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం పేదల పట్ల జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి చిత్తశుద్ధి లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిని ఇదే సందర్భంలో సర్వే చేయడం మోసం చేయడమే అని ఆమె అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్షులు కళ్యాణం లింగం నిర్మల రాజరత్నం ఎర్ర రజిత ముసిపట్ల జయ వలబోజు కళ్యాణ్ తిమోతి తిప్పారపు తులసి సింగార ఉపేంద్ర కర్రే యాదమ్మ తాచూరి భాగ్యలక్ష్మి చిలుక సునీత పసుల ఎండి అలీ తదితరులు పాల్గొన్నారు.