
ఈ రోజు…జనగామ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య గారిని తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు పుష్పగుచ్ఛం అందించి మార్యదపూర్వకంగా కలిసి స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి(స్టేషన్ ఘనుపూర్) , పల్లగుట్ట(చిల్పూర్) మరియు కళ్లెం(లింఘాలగణపురం) గ్రామాల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణాలు పూర్తయి పంపిణీకి సిందంగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయుటకు తగిన ఏర్పాట్లు చేయాల్సినదిగా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గంలోని మిగతా గ్రామాల్లో మంజూరు అయి అసంపూర్తి నిర్మాణ దశలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయుటకు , ఇంకా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కానీ గ్రామాల్లో సదరు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించుటకు యుద్ధప్రాతిపదికన ల్యాండ్ అలర్ట్మెంట్ చేయడంతో పాటుగా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా త్వరితగతిన పూర్తి చేయుటకు సంబంధిత మండలాల తహశీల్దార్లకు శాఖాపరమైన ఆదేశాలు జారిచేయుటకు కలెక్టర్ గారిని కోరగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు.గౌరవ కలెక్టర్ గారిని కలిసిన వారిలో చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పోట్లపల్లి శ్రీధర్ రావు , నియోజకవర్గ కోఆర్డినేటర్ కేసిరెడ్డి మనోజ్ రెడ్డి మరియు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్ గార్లు తదితరులు ఉన్నారు.