
ఎమ్మెల్యే బొల్లం అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం
కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్య యాదవ్ మరో మారు గెలవడం ఖాయమని కోదాడ పట్టణ 25 వ వార్డు టిఆర్ఎస్ నాయకులు చింతల నాగేశ్వరరావు అన్నారు. సోమవారంముఖ్యమంత్రి కేసీఆర్ కోదాడ నియోజకవర్గానికి పార్టీ టికెట్ ఎమ్మెల్యే బొల్లంకు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంపిణీ చేసుకొని బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మరో మరు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల లింగయ్య, పల్లపు పుల్లయ్య, యువజన నాయకులు అబీధర్ నాయుడు, తురక పిచ్చయ్య, తురక శ్రీను, శ్రీహరి, గణేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.