
ఎమ్మెల్యే రాజయ్య మద్దతుదారుల ధర్నా
నియోజకవర్గపరిధిలోని కరుణాపురం వద్ద హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఎమ్మెల్యే రాజయ్య మద్దతుదారులు స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే రాజయ్య కె ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై బైఠాయించారు.ఈ సందర్బంగా పెద్ద ఎత్తున
కడియం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.స్థానిక నాయకుడు ముద్దు వలసదారులు వద్దు,దళిత దొర కడియం వద్దు దళిత బిడ్డ రాజయ్య ముద్దు అంటూ ..పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కడియం దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నించగా చిల్పూర్ ఎస్సై వినయ్ కుమార్ ఆయన సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు.ధీంతొ కొద్దిసేపు పోలీసులకు నాయకులు మధ్య తోపులాట జరిగింది.దీంతో పాటు నియోజకవర్గం లోని పలు మండల కేంద్రాలలో కూడా రాజయ్య మద్దతుదారులు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు.